రాబోయే 2029 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓటమి చెందడం తథ్యమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జోస్యం చెప్పారు. కేంద్రంలో అధికార మార్పిడి జరగడం వందశాతం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తమ అధికారాన్ని కోల్పోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.