రాముడు కొలువైన అయోధ్య నగరం దీపావళి సందర్భంగా దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపాల వెలుగుల్లో సరయూ నది తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. శనివారం (నవంబర్ 7న) సాయంత్రం సమయంలో సరయూ నది తీరం వెంట ఉన్న 56 ఘాట్లలో 30 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించారు. రామ్ కీ పడీ ప్రధాన వేదికగా సాగిన ఈ వేడుకలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో దీపాలతో అయోధ్య తీరం గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.