డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకుమార్తెలు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగి ఇద్దరూ విజయం సాధించారు. కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానం నుంచి కూటమి (టీడీపీ) అభ్యర్థిగా పోటీ చేసిన పొనుగుపాటి చాందిని ఘన విజయం సాధించారు. మరోవైపు ఆమె తండ్రి పొనుగుపాటి సత్యనారాయణ పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.