శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీలు కౌంటింగ్ హాల్లోకి వెళ్లినట్లు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం వద్దకు దూసుకువచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అక్కడి ప్రధాన గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు-వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. లోపల ఉన్న ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరావును పోలీసులు వెలుపలికి పంపించడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తత ఎట్టకేలకు సద్దుమణిగింది.