నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ పరిశీలించిన ఎస్ఈసీ పునేఠా మాట్లాడుతూ .. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజుల పాటు భద్రపరుస్తున్నామని తెలిపారు. వివాదాలు ఉన్న చోట మరింత సమయం భద్రపరుస్తామన్నారు. ఇప్పటికే విపక్ష YSRCP ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర రికార్డులు భద్రపరచాలని ఎస్ఈసీకి పలు విజ్ఞప్తులు చేసింది. ఎందుకంటే ఈ ఫుటేజ్ ఆధారంగానే వైసీపీ ఎన్నికల పిటిషన్ల దాఖలుకు సిద్దమవుతోంది.