ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఒక మహిళా ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీసీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా మానసిక ఇబ్బందులకు గురిచేశారని ఆమె మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఏకాంతంగా గడపాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, భర్తను వదిలేస్తే తీసుకెళ్తానని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, స్వతంత్ర కమిటీతో నిష్పక్షపాత విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.