తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఆమె గుండెపోటుతో మరణించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో దివ్య విజయం సాధించినట్లు వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. తాను పోటీ చేసిన ఎన్నికల్లో గెలిచినట్లు తెలిసేలోపే ప్రాణాలు కోల్పోయిన ఆమె ఉదంతం గ్రామస్థులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.