సురేఖావాణికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. మొదట ఈ వీడియో నిజమైనదా? ఏఐ సాయంతో సృష్టించారా? అనే చర్చ నెట్టింట మొదలైంది. సురేఖావాణి అసలు విషయం వెల్లడిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత, ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చి వైరల్ అవుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దంటూ మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, ప్రెస్ సభ్యులను ప్రత్యేకంగా కోరారు.