UAEకి చెందిన ‘వరల్డ్ స్టార్ హోల్డింగ్’ సంస్థ మహిళా ఉద్యోగులకు ఖరీదైన ఐఫోన్ డ్యూయో ఫోన్లను బహుమతిగా అందించి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ రూమ్‌లోకి పిలిచారు. లోపలికి వెళ్లిన ఉద్యోగులు తమ కుర్చీలపై ఉన్న ఐఫోన్ బాక్సులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగికీ ఐఫోన్‌ను బహుమతిగా అందించడం విశేషంగా నిలిచింది.