మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల పంపకాల పై కూటమి పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. అందులో భాగంగా జనసేనకు అయిదు, బీజేపీకి ఒక స్థానం దక్కనుంది. జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాగా.. బీజేపీకి కడప జిల్లా జెడ్పీ పీఠం దక్కనుంది.