దిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382 మార్కును తాకి Very Poor కేటగిరీకి చేరడంతో దిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్స స్టేజి-III ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసరం కాని భవన నిర్మాణాలు, కూల్చివేతలు, తవ్వకాలు, కంకర రోడ్లపై నిర్మాణ సామగ్రి తరలింపుపై పూర్తి నిషేధం విధించారు. అదేవిధంగా బీఎస్-3 పెట్రోల్ కార్లు, బీఎస్-4 డీజిల్ కార్ల రాకపోకలపై కఠిన పరిమితులు అమలవుతాయి. ధూళి కాలుష్యాన్ని పెంచే స్టోన్ క్రషర్లు, గనుల తవ్వకాలు తక్షణమే నిలిపివేయబడతాయి.