మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా ర్యాలీ అయిన అమెరికా మార్కెట్లు.. మరుసటి రోజు ఢమాల్న కింద పడ్డాయి. వాల్‌స్ట్రీట్‌లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో 19 నెలల్లో ఎన్నడూలేనంత పతనాన్ని చవిచూశాయి. నాస్డాక్ సూచీ 5.52 శాతం పడిపోగా.. గత 19 నెలల్లో రోజువారీ అత్యధిక నష్టం ఇదే. ఎస్అండ్పీ 4.36 శాతం, డోజోన్స్ 3.4 శాతం చొప్పున క్షీణించాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి.