క్యాబ్ ఛార్జీల భారంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజలకు త్వరలోనే పెద్ద ఉపశమనం లభించనుంది. వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ ‘గ్రీన్ ఎస్ఎమ్’ తన పూర్తి ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను భాగ్యనగరంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. గ్రీన్ ఎస్ఎమ్ క్యాబ్‌లలో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు కేవలం రూ. 9 మాత్రమే వసూలు చేస్తారు. ఉదాహరణకు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే రూ. 90 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి దిగ్గజ సంస్థలకు ఈ సేవలు గట్టి పోటీనివ్వనున్నాయి.