అనంతపురం జిల్లాలో రిగ్గింగ్ కలకలం రేపింది. కూడేరు మండలం మరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ బాక్సును బద్దలు కొట్టి, చోరీ చేసినట్లు తెలుస్తోంది. మరికొందరు బ్యాలెట్ పత్రాలను చించేశారు. సీఐ రాజుతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు.