అమలాపురం, తుని మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్లో జనసేన ముందంజలో కొనసాగుతుండగా.. జగ్గయ్యపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీ, చిత్తూరు, విశాఖ కార్పొరేషన్ల పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్లో ఉంది. దానితోపాటు ధర్మవరం, వెంకటగిరి, పెనుకొండ మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ మిగతా పార్టీలను వెనుకకునెట్టి ముందంజలో కొనసాగుతోంది. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆధిక్యాన్ని కనబరుస్తుండగా.. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.