కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపాలిటీలో కూటమి విజయం సాధించింది. మొత్తం 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక వార్డుకు ఎన్నిక జరగ్గా.. అందులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థులు విజయాలు నమోదు చేశారు. 5వ వార్డులో జనసేన అభ్యర్థి సత్యనారాయణ 650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్ 773 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు