ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖ యువకులను ఓ నేపాల్ వ్యక్తి ఆర్మీలో ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగాలని చెప్పి ఆర్మీలో చేరిన తర్వాత తమను రష్యా-ఉక్రెయిన్ బార్డర్లో యుద్ధంలోకి పంపిస్తున్నారని వారు ఒక సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రష్యన్ భాషలో ఉన్న పేపర్లపై తమతో సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. తాము యుద్ధభూమిలో ఉన్నామని, ఇదే తమకు చివరిరోజు కావచ్చని చెబుతూ, దయచేసి ప్రధాని మోడీ తమ ప్రాణాలను కాపాడి ఏపీకి వచ్చేలా సహాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నారు.