రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉన్మాది హేమంత్ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు హేమంత్ కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో సగం కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్నారు. కుడి కాలుకు రక్త సరఫరా తగ్గిందని తెలిపారు. రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందో ఆపరేషన్ థియేటర్లోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. రక్త సరఫరా లేకుంటే కండరాలు చెడిపోతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.