తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అవకాశం కల్పించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లు గడిచిపోయాయని, అయినప్పటికీ తాను పరిస్థితులను అర్థం చేసుకొని మౌనంగా ఉంటున్నానని పేర్కొన్నారు నిధుల కోసం భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి అడగాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తూ, ‘మనసు చంపుకొని ఆయన దగ్గరకు వెళ్లా’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలోని వ్యవస్థలో లంచాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

