తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షాకి కేంద్ర కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న మహాపాదయాత్రలో ఆయన పాల్గొననుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌లు కూడా అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సమాచారం.