ఇండియా కూటమి మెగా ర్యాలీకి జనం రాకుండా అడ్డుకోవడానికి దీపావళి పండుగకు ముందు ఇండియా కూటమి ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారులు నష్టపోతారంటూ బీజేపీ, ప్రధాని మోదీ చేసిన ప్రచారం బెడిసికొట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. దిల్లీలో దుకాణాలు తెరిచే ఉన్నాయని, వ్యాపారాలు బాగా జరిగాయంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చేప్రజలు షాపింగ్ చేయడం వల్ల దిల్లీలోని చిన్న, పెద్ద వ్యాపారులందరికీ లాభం చేకూరుతుందన్న విషయం స్పష్టమైందని అన్నారు.