బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నేడు (నవంబర్ 2). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. బాద్షా 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’. ఈరోజు బాద్షా పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి తొలి పాట ‘తూ మిల్జాయే’ (Tu Mil Jaaye) ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.