పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో సోమవారం రీపోలింగ్ జరుగుతోంది. ఆదివారం జరిగిన పోలింగ్లో 23/1, 23/2 బూతుల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు అధికారులు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు