రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు మరో చీకటి అధ్యాయం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ కుప్పకూలింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇది ఎన్నిక కాదు.. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ప్రక్రియ మాత్రమే. ప్రజల తీర్పును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది.చివరి నిమిషం వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మహిళలకు, పార్టీ కార్యకర్తలకు నా అభినందనలు’ అని పేర్కొన్నారు.