అమెరికాలోని డాలస్లో కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో వేర్వేరు ఘటనల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. డీప్ ఎలమ్లో జరిగిన కాల్పుల ఘటనకు వీటితో సంబంధం ఉందా? అనే విషయాన్ని నిర్ధరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హాలోవీన్ వీకెండ్ సందర్భంగా అమెరికాలో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. డాలస్లో మూడు చోట్ల కాల్పులు జరిగాయని డాలస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమాక్స్ వెల్లడించారు.