కాకినాడ జిల్లా పిఠాపురం రథాలపేటలోని 18, 19 వార్డుల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా, స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలో ఉంచి.. జనసేన అభ్యర్థి, ఏజెంట్‌ను అనుమతించక పోవడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలింగ్ కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు.జనసేన కార్యకర్తల ఆందోళనతో చివరికి వారిద్దరినీ డీఎస్పీ అనుమతించారు. 19వ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి.