ఎస్ఐఆర్ సృష్టించిన పరిస్థితులకు పశ్చిమ బెంగాల్ బలైందని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆదివారం జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో దీదీ మాట్లాడుతూ.. మోసాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని, ప్రాణాలొడ్డి పోరాడతామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి తిరిగి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ, సమాజంలోని అన్ని వర్గాలూ ఒక్కటిగా రావాలని పిలుపునిచ్చారు.