మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వచ్చి వివేకా హత్య కేసు హంతకుడు దస్తగిరి హాల్ చల్ చేశాడు. ఇందుకు పోలీసులు సహకరించినట్టు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే కాన్వాయ్‌లోకి అనుమతించి.. ఆ తర్వాత పక్కకు తప్పించినట్లు డ్రామా చేశారని అన్నారు. ఒక హత్య కేసులో ముద్దాయిని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కాన్వాయ్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దస్తగిరితో టీడీపీ హైడ్రామాకు తెరలేపిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.