తెలంగాణలో న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సవరణ 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

