ఆంధ్రరాష్ట్రం, భారతదేశపు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.<span;>ఆ తర్వాత 1956 నవంబరు 1 తేదీన తెలంగాణ ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 58 సంవత్సరాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి