విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో మొత్తం 120 వార్డులకు సంబంధించి 18,37,901 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1,990 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 4,378 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 14,334 మంది సిబ్బందిని నియమించారు. 82 మంది రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు.