ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 13,504 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. శనివారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రిని కార్పొరేషన్, మున్సిపల్ ఆఫీసుల నుంచి కేంద్రాలకు విజయవంతంగా తరలిస్తున్నారు.