రాప్తాడు స్కూల్లో విద్యార్థినిపై దాడి నేపథ్యంలో స్కూల్ హెచ్ఎం రాజేశ్వరిని విద్యా శాఖ సస్పెండ్ చేసినట్లుగా వస్తున్న వార్తలను ఆమె కుమారుడు రాహుల్ కార్తికేయ ఖండించారు. కుటుంబ తగాదాల కారణంగానే విద్యార్థినిపై దాడి జరిగిందని డీఈవో నివేదికలో రాశారని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం మూడు గంటల పాటు తాను కూడా స్కూల్లోనే ఉన్నతాధికారులతో ఉన్నానని.. మా అమ్మకు ఎలాంటి సస్పెన్షన్ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పాఠశాలలో నిర్మాణాలు జరుగుతున్నాయని.. అందరూ అతడిని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కావొచ్చని భావించినట్లు రాహుల్ వివరించారు.