ఉక్కుమనిషి, మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ఏక్తానగర్లో ఉన్న పటేల్ భారీ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ప్రధాని పుష్పాంజలి ఘటించారు. దేశ సమగ్రతకు, భారతజాతి నిర్మాణానికి ఆయన చేసిన సేవలను మోదీ కొనియాడారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ఇతర ప్రముఖులు పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు.