మహారాష్ట్రలోని పుణె నగర పరిధిలో అశ్విని ఫుల్చంద్ కేకన్ అనే మహిళా కానిస్టేబుల్ మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ స్పందించింది. మంజరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో ఆమెను సస్పెండ్ చేశారు.పోలీస్ యూనిఫాంలో మద్యం సేవించడం, విధుల్లో ఉండగా స్థానికులతో దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు కూడా ఆమెపై వచ్చాయి.