తమిళనాడులో నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు వయో పరిమితిని ఐదేళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు, ఇతర రిజర్వుడు కేటగిరీలకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్ళకు,జనరల్ కేటగిరీలో దివ్యాంగులకు 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లు, ఇతర కేటగిరీల్లో దివ్యాంగులకు 47 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు వయో పరిమితి పెరిగింది.ఇది ఇప్పటికే రిజర్వుడు కేటగిరీల మినహాయింపుకు అదనమని ప్రభుత్వం తెలిపింది.