ఆంధ్రప్రదేశ్‌లోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. నవంబరు 1న పోలింగ్ జరగనుండటంతో, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే లౌడ్స్పీకర్లు, బహిరంగ సభలు, ఊరేగింపులతో కూడిన అధికారిక ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లకు గాను 118 డివిజన్లు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.