భారత నౌకాదళంలోని అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై రఫేల్ మెరైన్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో విమానాన్ని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడానికి ముందు.. దాని విమాన వాహక నౌక కార్యకలాపాలలో అనుసంధానించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి దీని కార్యకలాపాల కోసం అవసరమైన మార్పులను అంచనా వేసేందుకు నౌకాదళం గోవాలో రఫేల్ మెరైన్ విమాన పరీక్షలు నిర్వహిస్తోంది