అనిరుధ్ ,కావ్య మారన్ల రిసెప్షన్ కు ప్రత్యేకమైన వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను డిజైన్ చేసిన రంజినీ అయ్యంగార్ దాని విశేషాలను పంచుకున్నారు. నీలం, తెలుపు రంగుల థీమ్‌ను ఎంచుకున్నాం.అతిథులు ఒక మధుర జ్ఞాపికగా దాచుకునేలా చెక్కతో చేసిన ప్రత్యేకమైన పెట్టె (వుడెన్ బాక్స్)లో త్రీడీ ఎలిమెంట్స్‌తో దీనిని రూపొందించాం” అని అన్నారు. ఈ పెట్టెపై చేతితో గీసిన అందమైన చిత్రాలు కూడా ఉన్నాయని సమాచారం. వచ్చిన ఎన్నో ఖరీదైన శుభలేఖల మధ్య ఇది ప్రత్యేకంగా నిలవాలన్నదే తమ ఉద్దేశమని ఆమె వివరించారు.