డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల బారిన పడి డబ్బులు నష్టపోయిన బాధితులకు బ్యాంకులే జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అకౌంట్లను రక్షించడం బ్యాంకుల ప్రాథమిక బాధ్యత అని ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. బ్యాంకుల నిర్లక్ష్యం లేదా డ్యూ డిలిజెన్స్ లోపం వల్ల మోసం జరిగితే, బాధితుడికి జరిగిన పూర్తి నష్టాన్ని ఆ బ్యాంకులే చెల్లించాలని, అవసరమైతే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చదువుకున్న వాళ్లు కూడా ‘డిజిటల్ అరెస్ట్’ భయాల్లో చిక్కుకోవడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.