అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలో యుద్ధప్రాతిపదికన అంటువ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 475 మంది సిబ్బందితో 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఈ రెండు జిల్లాలలో కోనసీమకు 55, పశ్చిమ గోదావరికి 45 బృందాలను కేటాయించి, తొమ్మిది జిల్లాల నుంచి సిబ్బందిని సమకూర్చారు. మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్, క్లోరినేషన్ పనులను ఈ బృందాలు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు.