కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజ, పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు కేటీఆర్‌పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు వెంకట్ కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని పేర్కొన్న ఆమె, తన సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ తన పెళ్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, తన భర్తకు పలువురితో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.