భారత్లో మరో కీలక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న ‘నాగరికతల సంభాషణ వేదిక’కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని ఎస్సీఓలోని పది సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి తమ దేశం తరఫున ఎవరు హాజరవుతారనే విషయాన్ని పాకిస్థాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 25కు పైగా దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేదికను ప్రారంభిస్తారని భావిస్తున్నారు.