ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సమరంలో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్క్రూట్నీ అనంతరం అధికారులు తిరస్కరించినవి పోను, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,815 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ నిర్దేశించిన సమయం ముగియడంతో ఎన్నికల అధికారులు బరిలో మిగిలిన తుది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే కసరత్తులో ఉన్నారు.