వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెటైర్ విసిరారు. ఈరోజు ఎన్డీఏ మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ‘మీరు 2.O చూపిస్తే మేం 10 X చూపిస్తాం. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు’ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలు తమ ముందున్నాయన్నారు.