రాష్ట్రంపైకి అర్నబ్ తుపాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారింది. ఒక రోజంతా అలాగే కొనసాగనుండడంతో నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈరోజు (మంగళవారం) ఉదయానికి అదే ప్రాంతంలో అతి తీవ్ర తుపానుగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి బాపట్ల-విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో గాలుల వేగం 115 కి.మీ నుంచి 125 కి.మీ. వరకు ఉండొచ్చు.