అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ నేతృత్వంలో ఉక్రెయిన్, రష్యాల మధ్య కాల్పుల విరమణ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దక్షిణ ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ఒలేష్కీ పట్టణంలోకి సహాయక బృందాన్ని అనుమతించేందుకు, ఉక్రెయిన్ లో తెల్లవారుజామున 3 గంటల తర్వాత కాల్పుల విరామం ప్రారంభమైంది. పట్టణంలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్న మెలానియా ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ లకు చెందిన పౌర మధ్యవర్తులతో చర్చలు జరిపారు.