టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, రష్మిక వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా కల్పిత వ్యాఖ్యలు, నకిలీ స్క్రీన్షాట్లను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విరోష్ టీం పోలీసులను కోరింది. ఈ దుష్ప్రచారం ఇబ్బందులు కలుగజేసిందని వారి మేనేజర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.