నాది అనుకోకుండా మనది అన్న వాడే మనిషి, మగాడు అంటూ అనంతపురంలో సినిమా డైలాగుతో సినీ నటుడు సాయికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 55వ డివిజన్ పరిధిలో కూటమి బలపరిచిన అభ్యర్థులతో కలిసి సినీ నటుడు సాయికుమార్, మంత్రి సత్య కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం సమానంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాగిందని, అనంత నగర మేయర్ పీఠం భాజపాకు దక్కితే ట్రిబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి చెందుతుందన్నారు.