ఏపీలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్పెషల్ టెట్ ఫలితాలు విడుదలపై తీవ్రమైన సందిగ్ధం నెలకొంది. పరీక్ష కోసం ఒక్కో పేపర్‌కు 700 చొప్పున ప్రశ్నలు ముందుగానే వెబ్సైట్లో పెట్టారు. అవే ప్రశ్నలు వరుసగా పరీక్షలో రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు టెట్ రద్దు చేయాలని కొందరు ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. ప్రభుత్వం కూడా టెట్ రద్దుకు హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మరింత అయోమయంలో పడ్డారు.